ఐపీఎల్ 2002లో పది టీమ్స్.... బీసీసీఐ ఆమోదముద్ర.

 


వచ్చే ఏడాది ఐపీఎల్‌లో కొత్త జట్లు వస్తాయంటూ జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. 2021 ఐపీఎల్‌కు తక్కువ సమయం ఉండటంతో ఇప్పటికిప్పుడు టెండర్లు పిలిచి.. వేలం నిర్వహించడం సాధ్యపడదని భావించిన బీసీసీఐ.. ఐపీఎల్ 2022లో రెండు కొత్త జట్లను ఆడించేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అహ్మదాబాద్‌లో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆమోదముద్ర వేసింది. ఆ రెండు జట్లు ఏవి అనేది తెలియాల్సి ఉండగా.. గుజరాత్ జట్టు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ప్రముఖ దిగ్గజ వ్యాపారస్తులు గౌతమ్ అదానీ, సంజీవ్ గోయెంకాలు కొత్త జట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు వినికిడి. కాగా, టోర్నీలో పది జట్లు పాల్గొంటే.. మ్యాచ్‌లు సంఖ్య 94కు చేరుకుంటుంది. ఈ క్రమంలోనే టోర్నమెంట్‌ను రెండున్నర నెలలు నిర్వహించాల్సి ఉంటుంది. మరి ఈ విషయాలపై బీసీసీఐ ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటున్నది వేచి చూడాలి.