ఈనెల 21న అంతరిక్షంలో మహా అద్భుతం ఆవిష్కృతం కానుంది.

 


అంతరిక్షంలో ఈనెల 21న ఆవిష్కృతం  మహా అద్భుతం కానుంది. రెండు పెద్ద గ్రహాలు ఒక్కటైపోయాయా అనిపించేంతగా ఇవి దగ్గర కానున్నాయి. అంతేకాదు, ఓ భారీ నక్షత్రంలా ప్రకాశించనున్నాయి. సౌర కుటుంబంలోని రెండు పెద్ద గ్రహాలైన గురుడు, శని ఒకదానికొకటి అత్యంత సమీపంలోకి రానుండడమే దీనికి కారణం. ఆ సమయంలో వాటి మధ్య దూరం 73.50 కోట్ల కిలో మీటర్లుగా మాత్రమే ఉంటుంది. 1623వ సంవత్సరం తర్వాత జరిగే ఈ అద్భుతం ఖగోళ ప్రియులకు కనువిందు చేయనుంది. ‘మహా సంయోగం’గా పిలిచే ఈ అంతరిక్ష అద్భుతం భారతీయులకు కూడా కనువిందు చేస్తుందని, దేశంలోని అన్ని ప్రాంతాల వారూ సూర్యాస్తమయం తర్వాత చూడవచ్చని కోల్‌కతాలోని జేపీ బిర్లా ప్లానిటోరియం డైరెక్టర్‌ దేవీ ప్రసాద్‌ దురై వెల్లడించారు.