భారతీయుడు 2 సినిమా షూటింగ్ రీస్టార్ట్.

 


శంకర్ సినిమా అంటేనే సంచలనం. ఇప్పటి వరకు ఓటమి ఎరుగని దర్శకుల్లో ఆయన ఒకరు. ఆయన టేకాఫ్ చేశాడంటే చాలు ఆ సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉంటాయి. ప్రతి హీరో ఆయన దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని అనుకుంటారు. అయితే విలక్షణ నటుడు కమల్‌హాసన్, శంకర్ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన భారతీయుడు సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. భారత స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రతీ ఒక్కరిని ఆకర్షించింది. అయితే 24 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌ ఆరంభించారు శంకర్. గతేడాది మూడు షెడ్యూల్స్‌ కూడా ముగించారు. కానీ షూటింగ్‌ సమయంలో జరిగిన ప్రమాదం, ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్‌ వల్ల చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. అయితే బడ్జెట్‌ సమస్యల వల్ల సినిమా మళ్లీ ట్రాక్‌ ఎక్కదనే వార్త మొదలైంది కానీ అది నిజం కాదు. త్వరలో నాలుగో షెడ్యూల్‌ మొదలుపెట్టడానికి చిత్రబృందం ప్లాన్‌ చేసింది.ఈ సినిమాలో హీరోయిన్స్‌గా కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతిసింగ్, అలాగే సిద్ధార్థ్ నటిస్తున్నారు. జనవరిలో రెగ్యూలర్‌గా షూటింగ్ ప్లాన్ చేశారు చిత్రబృందం. చెన్నైలో షెడ్యూల్‌ పూర్తి చేశాక, దేశంలో పలు లొకేషన్స్‌లో షూటింగ్‌ చేయాలనుకుంటున్నారు. అలాగే విదేశాల్లోనూ షెడ్యూల్స్‌ ఉంటాయని సమాచారం.