మోర్ ఫన్ తో వస్తున్న ఎఫ్3 సినిమా

 


విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన సినిమా ఎఫ్2 ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఎఫ్3 టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాలో మరింత ఫన్ ను జోడించనున్నాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ సినిమాషూటింగ్ జనవరి నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో వెంకటేష్ వరుణ్ తేజ్ లతోపాటు మరో హీరో కూడా నటించబోతున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. అయితే మొదట మూడో హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నాడని అన్నారు, ఆ తర్వాత మాస్ రాజా రవితేజ పేరు వినిపించింది. ఆతర్వాత సునీల్ నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు మూడో హీరో మీద అటు దర్శకుడు కాని చిత్రయూనిట్ కానీ ఎవ్వరూ స్పందించలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్లో జోరుగా చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు కనిపించనున్నారట. ఎఫ్ 2 లో నటించిన తమన్నా , మెహరీన్ లు ఎఫ్3 లోనూ కంటిన్యూ అవుతున్నారు.. వీరితో పాటు మరో ముగ్గురు హీరోయిన్లు కూడా నటిస్తున్నారని అంటున్నారు. అందులో పాయల్ రాజ్ పుత్ , రాశీఖన్నా, నటిస్తుండగా రష్మిక మందన గెస్ట్ రోల్ లో కనిపించనుందని అంటున్నారు. మరి ఈవార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.