నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా పీఎస్ఎల్వీ సీ 50 .

 


నెల్లూరు జిల్లా శ్రీహ‌రికోటలోని స‌తీష్ ధావ‌న్ స్పేస్ సెంట‌ర్ రెండో ప్ర‌యోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ 50  దూసుకెళ్లేందుకు సిద్ధ‌మైంది. ఈ ప్ర‌యోగానికి ఏర్పాట్ల‌న్నీ పూర్త‌య్యాయి. కమ్యూనికేషన్ శాటిలైట్ సీఎంఎస్-01ను నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. అత్యాధునిక సాంకేతిక స‌మాచారాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో సాగించే నిరంత‌ర ప్ర‌క్రియ మ‌రింత వేగ‌వంత‌మైంది. షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 17న మ‌ధ్యాహ్నం 3:41 గంటలకు పీఎస్‌ఎల్‌వీ – సీ50 ఉపగ్రహ వాహకనౌకను ప్ర‌యోగించ‌నున్నారు. అయితే మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2:41 గంట‌ల‌కు కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. 1,410 బ‌రువుతో నింగిలోకి.. 1,410 కిలోల బరువు కలిగిన సీఎంఎస్‌–01 (జీశాట్‌–12ఆర్‌) అనే సరికొత్త కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని ఇస్రో నింగిలోకి పంపనున్నారు. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ సిరీస్‌‌లో ఇది 22వది అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిష‌న్ అని వెల్లడించింది. పూర్తి స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారు చేసిన సీఎంఎస్‌01(జీ సాట్‌14ఆర్‌) ఉప‌గ్ర‌హాన్ని నింగిలోకి పంప‌నున్నారు ఇస్రో శాస్త్ర‌వేత్త‌లు. అనుసంధాన ప్ర‌క్రియ పూర్తి చేసుకున్న రాకెట్‌ను ఆదివారం షార్‌లోని రెండ‌వ ప్ర‌యోగ వేదిక‌పైకి శాస్త్ర‌వేత్త‌లు చేర‌వేశారు. ఇక ప్ర‌యోగ రిహార్స‌ల్స్‌ను సోమ‌వారం ప్రారంభించారు.