పిఎస్ఎల్వి సి -50 రాకెట్ ప్రయోగం విజయవంతం


 

PSLV- C50రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. నిప్పులు చిమ్ముకుంటూ.. దేశీయ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు కక్ష్యలోకి పంపింది ఇస్రో. నిర్ధేశిత సమయంలోనే ఉపగ్రహం కక్ష్యలోకి చేరుకునేలా కృషిచేశారు సైంటిస్టులు. మొత్తం 1410 కిలోల బరువు కలిగిన 42వ దేశీయ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం CMS-01ను ఈ రాకెట్‌ జియో స్టేషనరీ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి చేరవేసింది. 2011లో ప్రయోగించిన జీశాట్‌-12 కాలపరిమితి ముగిసిపోవడంతో దాని ప్లేస్‌లో జీశాట్‌-12R ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ప్రస్తుతం దాని పేరును CMS-01గా మార్చి కక్ష్యలోకి చేరవేశారు. 25గంటల కౌన్‌డౌన్‌ పూర్తైన తర్వాత మధ్యాహ్నం 3 .41 నిమిషాలకు PSLV సి 50 రాకెట్‌ను నింగిలోకి పంపారు. GSAT -14R అనే ఉపగ్రహాన్ని 36 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్షలోకి ప్రవేశ పెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు.