ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-AAI లో ఉద్యోగాల కు నోటిఫికేషన్ విడుదల .

 


నిరుద్యోగులకు శుభవార్త. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-AAI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీర్, టెక్నీషియన్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 180 ఖాళీలు ఉన్నాయి. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. వెస్టర్న్ రీజియన్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 డిసెంబర్ 31 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.aai.aero/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు https://apprenticeshipindia.org/ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీలు- 180 గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్- 159 డిగ్రీ ఇన్ మెకానిక్ లేదా ఆటో ఇంజనీరింగ్- 31డిగ్రీ ఇన్ కమ్యూనికేషన్ నేవిగేషనల్ సర్వెయలెన్స్- 29 డిగ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్- 26 డిప్లొమా ఇన్ మెకానిక్ లేదా ఆటో ఇంజనీరింగ్- 27 డిప్లొమా ఇన్ కమ్యూనికేషన్ నేవిగేషనల్ సర్వెయలెన్స్- 22 డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్- 24 ట్రేడ్ అప్రెంటీస్- 21 మోటార్ వెహికిల్ మెకానిక్- 10 డీజిల్ మెకానిక్- 11 దరఖాస్తు ప్రారంభం- 2020 డిసెంబర్ 9 దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 31 సాయంత్రం 6 గంటలు స్టైపెండ్- ట్రేడ్ అప్రెంటీస్‌కు రూ.9,000. డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు రూ.15,000. విద్యార్హతలు- ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా పాస్ కావాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు సంబంధిత బ్రాంచ్‌లో డిగ్రీ పాస్ కావాలి. వయస్సు- 2020 నవంబర్ 30 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం- మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.