సిద్దిపేటలో అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ శ్రీకారం.

 


సిద్ధిపేట .. కేసీఆర్ వర సిద్ధిపేటగా మారబోతోంది. ఒకటి కాదు రెండు కాదు.. సిద్ధిపేటను అభివృద్ధి బాటలో నడిపేందుకు అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నారు సీఎం కేసీఆర్. అన్నిటికంటే ప్రతిష్టాత్మకంగా రూ.163కోట్లతో నిర్మించిన 2వేల 460 డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత పట్టణ శివారులో రూ.45కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్‌కి శంకుస్థాపన, రూ.135కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌, రూ.225 కోట్లతో రూపుదిద్దుకోబోతు్న వెయ్యి పడకల ఆస్పత్రికి ఇవాళ కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. అలాగే, రూ. 278కోట్లతో అభివృద్ధి చేసిన సిద్ధిపేట చింతల్ చెరువును కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఇక, రంగనాయక సాగర్ దగ్గర రూ.8కోట్లతో నిర్మించిన గెస్ట్‌హౌస్‌, మిట్టపల్లిలో రైతు వేదిక కూడా ప్రారంభిస్తారు. వీటితో పాటు సిద్ధిపేటలో నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా అధినేత హోదాలో కేసీఆర్ ప్రారంభిస్తారు.