కేంద్ర ప్రభుత్వం తీరుపై రైతు సంఘాల నేతలు మండిపాటు .

 


కేంద్ర ప్రభుత్వం తీరుపై రైతు సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. కొత్తగా తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రంలోని పెద్దలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన భారతీయ కిసాన్ యూనియన్(హర్యానా) అధ్యక్షుడు గుర్నమ్ సింగ్ సంచలన విషయాలు వెల్లడించాడు. కనీస మద్దతు ధర విషయంలో కేంద ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు కేంద్రంతో జరిగిన చర్చల్లో ఒక్కటి కూడా ఆమోద యోగ్యంగా జరగలేదన్నారు. డిసెంబర్ 8వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో.. అన్ని రకాలా ధాన్యాలను మద్దతు ధరకు కొనలేమని స్పష్టం చేసినట్లు గుర్నమ్ సింగ్ వెల్లడించారు. 23 రకాల వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధరకు కొనాలంటే రూ. 17 లక్షల కోట్లు అవసరం అవుతాయని, ఈ కారణంగా అన్ని పంటలను మద్దతు ధరకు కొనలేమని అమిత్ షా అన్నట్లు ఆయన చెప్పారు. కొత్తగా తీసుకువచ్చిన చట్టంలో ఎంఎస్‌పీ అనే పదాన్ని వాడుతారే తప్ప.. భవిష్యత్‌లోనూ ఇప్పుడు చెల్లించే ధరలకే ధన్యాన్ని కొనుగోలు చేస్తారని గుర్నమ్ సింగ్ అన్నారు. కనీస మద్ధతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదని, ఇలా అయితే రైతు మనుగడ సాగించలేడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. కొత్తగా తీసుకువచ్చిన చట్టాలను రద్దు చేయాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. తమ ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్రంలోని పెద్దలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రైతు సంఘం నేతలు మండిపడుతున్నారు. తాజాగా మీడియా ముందుకు వచ్చిన భారతీయ కిసాన్ యూనియన్(హర్యానా) అధ్యక్షుడు గుర్నమ్ సింగ్ సంచలన విషయాలు వెల్లడించాడు. కనీస మద్దతు ధర విషయంలో కేంద ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు కేంద్రంతో జరిగిన చర్చల్లో ఒక్కటి కూడా ఆమోద యోగ్యంగా జరగలేదన్నారు. డిసెంబర్ 8వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో.. అన్ని రకాలా ధాన్యాలను మద్దతు ధరకు కొనలేమని స్పష్టం చేసినట్లు గుర్నమ్ సింగ్ వెల్లడించారు. 23 రకాల వ్యవసాయ ఉత్పత్తులను మద్దతు ధరకు కొనాలంటే రూ. 17 లక్షల కోట్లు అవసరం అవుతాయని, ఈ కారణంగా అన్ని పంటలను మద్దతు ధరకు కొనలేమని అమిత్ షా అన్నట్లు ఆయన చెప్పారు. కొత్తగా తీసుకువచ్చిన చట్టంలో ఎంఎస్‌పీ అనే పదాన్ని వాడుతారే తప్ప.. భవిష్యత్‌లోనూ ఇప్పుడు చెల్లించే ధరలకే ధన్యాన్ని కొనుగోలు చేస్తారని గుర్నమ్ సింగ్ అన్నారు. కనీస మద్ధతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం సిద్ధంగా లేదని, ఇలా అయితే రైతు మనుగడ సాగించలేడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.