కొత్త వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ సమావేశం.

 


కరోనాతో కష్టపడుతున్న ప్రపంచాన్ని సరికొత్త స్ట్రెయిన్ వైరస్ కలవరపెడుతోంది. బ్రిటన్ సహా పలు దేశాల్లో విజ‌ృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డిసెంబర్ 23న సమావేశమవనుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజినల్ డైరెక్టర్ హన్స్ కుగ్లే మాట్లాడుతూ… బ్రిటన్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే వాహనాలు, విమానాల రాకపోకలను రద్ద చేస్తున్నామని అన్నారు. జెనీవా ఒప్పంద బృందం ఇప్పటికే బ్రిటన్‌తో పుట్టుకొచ్చిన కొత్త వైరస్‌ను గుర్తించడం జరిగిందని తెలిపారు. కార్గో విమానాలు, నిత్యవసర వస్తు, సేవలను బ్రిటన్‌కు అందజేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం బ్రిటన్ దేశానికి అవసరమైన అన్ని నిత్యావసర వస్తువులను అందించేందుకు సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఆమె తెలియజేశారు. బయోటెక్, మోడెర్నా టీకాలను స్ట్రెయిన్ వైరస్‌కు వ్యాక్సిన్‌గా వినియోగించేందుకు సిద్ధమవుతున్నట్లు ఆమె తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం స్ట్రెయిన్ వైరస్‌పై పరిశోధన చేస్తోందని ఆమె అన్నారు. కానీ, ప్రస్తుతానికి కొత్త వైరస్‌ గురించిన పూర్తి సమాచారం ఇంకా లభించలేదని తెలిపారు. అంతేకాకుండా కరోనా వైరస్ టీకా స్ట్రెయిన్ వైరస్‌పై ఎంత మేరకు పని చేస్తోందనే విషయం తెలియదని వివరించారు.