ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన అలియా భట్.

 


దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాకోసం అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజుగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గిరిజన వీరుడు కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు వీరులకు సంబందించిన టీజర్స్ ను విడుదల చేశారు రాజమౌళి. ఈ టీజర్లు సినిమా పై అంచనాలను మరింత పెంచాయి. ఇక ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదాపడి ఇటీవలే తిరిగి ప్రారంభం అయ్యింది. ఇప్పటికే ఆలస్యం అవ్వడంతో షూటింగ్ ను చకచకా పూర్తి చేస్తున్నాడు జక్కన్న. ఇక ఆర్ఆర్ఆర్ లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్ కోసం అలియాభట్ ఈ రోజు ఉదయం ముంబై నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. అలియాభ‌ట్ ముంబైలోని ఓ ప్రైవేట్ ఎయిర్ పోర్టులో క‌నిపించిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. చివరకు ఆర్ఆర్ఆర్ బృందంతో కలవబోతున్నానంటూ అలియా తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటోను షేర్ చేసింది.