మరో హాలీవుడ్ మూవీ లో హీరో ధనుష్

 


తమిళ స్టార్ హీరో ధనుష్​ మరోసారి హాలీవుడ్​ మూవీలో నటించబోతున్నారు. ర్యాన్ గాస్లింగ్​, క్రిస్​ ఇవాన్స్​ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘ది గ్రే మ్యాన్​’ అనే చిత్రంలో పాత్ర కోసం ధనుష్​ను ఎంపికచేసింది మూవీ యూనిట్. నెట్​ఫ్లిక్స్​ కోసం రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘అవెంజర్స్:ఎండ్​గేమ్’ ఫేమ్ ఆంటోనీ రూసో, జో రూసో సంయుక్తంగా డైరెక్ట్ చేస్తున్నారు. మార్క్​ గ్రీనీ రచించిన నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ‘గేమ్​ ఆఫ్​ థ్రోన్స్​’ నటి అలుమ్​ జెస్సికా హెన్విక్, ‘నార్కోస్​’ నటుడు వాగ్నెర్​ మౌరా, ‘వన్స్​ అపాన్​ ఏ టైమ్ ఇన్​ హాలీవుడ్​’లోని చైల్డ్ యాక్టర్ జూలియా బటర్స్​‌లతో పాటు ధనుష్ ఈ మూవీలో కీ రోల్స్ పోషించబోతున్నారు. కెన్​ స్కాట్​ డైరెక్షన్‌లో వచ్చిన ‘ది ఎక్స్​ట్రార్డినరీ జర్నీ ఆఫ్​ ది ఫకీర్​’ అనే మూవీ ద్వారా ధనుష్​ హాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2018లో విడుదలయిన ఈ చిత్రానికి మంచి స్పందన లభించింది. కాగా ధనుష్​.. ప్రస్తుతం ‘అంత్రాగిరే’ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ధనుష్​తో పాటు అక్షయ్​ కుమార్​, సారా అలీఖాన్​ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.