రైతు సంఘాల ను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం.

 


కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలంటూ రైతులు పట్టుబట్టారు. దీంతో రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మరోసారి రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రైతు సంఘాలతో ఈనెల ఈనెల 30న మధ్యాహ్నం 2 గంటలకు చర్చలు ప్రారంభం కానున్నాయి. కాగా, మూడు వ్యవసాయ చట్టాలను తొలగించే అంశం, కనీస మద్దతు ధరకు చట్టబద్దమైన హామీ ఇవ్వడం, పంట వ్యర్థాలు తగులబెట్టిన విషయంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయడం, విద్యుత్‌ ముసాయాదా బిల్లు -2020లో మార్పులు తదితర అంశాలను ఎజెండాలో తప్పనిసరిగా చేర్చాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే మళ్లీ చర్చలకు వస్తామని రైతు సంఘాలు తెలిపాయి. మరి ఈ చర్చల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.