భూగోళంపై మహాప్రళయం.

 


ప్రపంచం అంతమైపోతోంది..’ యుగాల నుంచీ ఈ మాట వినిపించేదే. అయితే, ఈ దశాబ్దంలో మాత్రం ‘యుగాంతం’ అనే పదం వాడుక ఎక్కువైపోయింది. రకరకాల ధియరీలు చెబుతూ పలు రకాల సిద్ధాంతాలను ఆధారంగా చూపిస్తూ ఈ భూగోళం అంతం కానుందన్న వ్యాఖ్యానాలు చెబుతున్నారు. అయితే, ఇప్పటివరకూ వచ్చిన ఏ వాదనా దీనికి సంబంధించి నిజం కాకపోవడం మానవాళికి ఉపశమనం కలిగించే విషయం. అయితే, కరోనా మహమ్మారితో 2020వ సంవత్సరం యావత్ నాగరిక ప్రపంచాన్నీ ఒక ఊపు ఊపింది.. అది వేరే సంగతి. అయితే, అనేక ఉత్పాతాలు సంభవించి మానవాళి అంతమవుతుందన్న జ్యోతిష్యాలు మాత్రం వట్టివే అని తేలిపోయాయి. పెద్దగా సోదిలో లేని అనామక మాయన్ క్యాలెండర్ ప్రకారం, ప్రపంచం 2020 జూన్ 21 న ముగుస్తుందని సూచించింది. దేవుని దయవల్ల అది నిజం కాలేదు. అంతకుముందు 2012, తర్వాత 2003లోనూ ఇదే తరహా వాదనలు వినిపించాయి. అవికూడా అబద్ధమేనని తేలిపోగా, మళ్ళీ ఇప్పుడు 2050లో భూమండలంపై ఒక మహాప్రళయం సంభవించి డూమ్స్ డే ప్రాతిపదికన యుగాంతం జరుగుతుందని మరో కొత్త డెడ్ లైన్ పెడుతున్నారు. అయితే, ఇవన్నీ వట్టిదేనని కొట్టపారేస్తున్నారు కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు.