లక్ష ఎకరాల సాగే లక్ష్యం.మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన.

 


రాయలసీమ సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కార్ మరో ముందడుగు వేయనుంది. రాప్తాడు నియోజకవర్గ ప్రజలకు లక్ష ఎకరాలకు నీరిస్తానన్న హామీని నిలబెట్టుకోబోతున్నారు. నీటి పారుదలలో భాగంగా అనంతపురం జిల్లాలో రేపు మూడు రిజర్వాయర్ల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. వర్చువల్ విధానం ద్వారా నిర్మాణ భూమి పూజకు శ్రీకారం చుట్టనున్నారు. మొత్తం నాలుగు రిజర్వాయర్లు, ప్రధాన కాలువ కోసం రూ.800 కోట్లను ఏపీ ప్రభుత్వం వెచ్చిస్తోంది. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లిలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను సీఎం స్విచాన్ ద్వారా ప్రారంభించనున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్లు నిర్మాణం కానున్నాయి. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటి తరలింపు కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. ఏడు మండలాల్లోని 35 గ్రామాలకు లబ్ధి చేకూరనుంది.