రైతులతో కేంద్రం చర్చలు ప్రారంభo

 


న్యూఢిల్లీ : రైతులు, ప్రభుత్వం మధ్య కృషి విజ్ఞాన్ భవన్‌లో చర్చలు ప్రారంభమయ్యాయి. కేంద్ర మంత్రులు పీయూశ్ గోయల్, నరేంద్ర సింగ్ తోమర్ ఈ చర్చలకు హాజరయ్యారు. ''నేను, కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్, ఇతర అధికారులు ఈ చర్చలకు హాజరవుతున్నాం.'' అని తోమర్ ప్రకటించారు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకున్న అపోహలను తొలగించే ప్రయత్నం కేంద్ర మంత్రులు చేస్తున్నట్లు సమాచారం. మొదట రైతుల వాదనలు శ్రద్ధగా ఆలకిస్తామని, ఆ తరువాతే ప్రభుత్వ సమాధానాలు ఉంటాయని తోమర్ ప్రకటించారు. అయితే కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి మ్యాాచ్సు రైతులతో కేంద్రంంం చర్చలుకునే ప్రసక్తే లేదని, రైతుల్లో ఉన్న అపోహలను మాత్రం కచ్చితంగా తొలగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉదయమే స్పష్టం చేశారు. చర్చలకు హాజరైన కేంద్ర మంత్రులు కూడా కనీస మద్దతు ధర, మార్కెట్ కమిటీలపై రైతుల్లో ఉన్న అపోహలను తొలగించడానికే శతధా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.