సరికొత్త స్మార్ట్ వాచీలను విడుదల చేసిన రియల్ మీ కంపెనీ.

 


ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ సరికొత్త స్మార్ట్ వాచీలను విడుదల చేసింది. ఎస్ ప్రో, ఎస్ బ్రాండ్లతో వీటిని ప్రవేశపెట్టింది. ఇందులో సర్య్కులర్ డిజైన్‏తోపాటు హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ మానిటరింగ్ వంటి కొత్త ఫీచర్స్‏ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కొత్త స్మార్ట్ వాచీలను డిసెంబర్ 29 నుంచి రియల్ మీ.. ఫ్లిప్ కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లతోపాటు, పలు స్టోర్లలలో వీటిని అమ్మనుంది. కాగా రియల్ మీ ప్రవేశ పెట్టి ఎస్ ప్రో వాచీ ధర రూ.9,999 కాగా.. ఎస్ వాచీ ధర రూ.4,999 నిర్ణయించింది. అటు వీటికి సమానంగా ఉండే ఎస్ మాస్టర్ ఎడిషన్ పేరుతో మరో స్మార్ట్ వాచీని కూడా ఈ సంస్థ విడుదల చేసింది. దీని ధర రూ.5,999గా ఉండనుంది. రియల్ మీ ప్రవేశ పెట్టిన ఈ స్మార్ట్ వాచీలు బ్లాక్, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ కలర్స్‏లో లభించనున్నాయి. వీటికి అనుగుణంగా వేగన్ లెదర్ స్ట్రాప్స్ కూడా బ్లాక్, ఆరెంజ్, బ్లూ, గ్రీన్ కలర్లలో లభించనున్నాయి. వీటికి రూ.499-999 వరకు ఎక్స్ ట్రా చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఎస్ ప్రో వాచీలో 420 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. మాగ్నిటిక్ చార్జింగ్ బేస్‏తో దీనికి కేవలం రెండు గంటల్లో పూర్తి చార్జింగ్ కానుంది. అటు ఎస్ వాచీ కూడా బ్లడ్ ఆక్సిజన్ లెవల్ మానిటరింగ్‏కు ఎస్‏పీవో 2 ఫీచర్ కలిగి ఉంది. అయితే ఈ వాచీ మాత్రం స్విమ్మింగ్‏కు అనుకూలం కాదు.