కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం .

 


కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైల్వేలో సేవల వినియోగానికి ఉద్దేశించిన ఐఆర్‌సీటీసీ తన వాటాను అమ్మకం ద్వారా 4,200 కోట్ల రూపాయలను పొందాలని యోచిస్తోంది. కాగా, ఐఆర్‌సీటీసీలో కేంద్రానికి 87.4 శాతం వాటా ఉంది. దానిని 20 శాతానికి తగ్గేందుకు కేంద్రం చూస్తోంది. 3.2 కోట్ల షేర్లను అమ్మకానికి పెడుతోంది. ఒక్క షేర్ ధర మార్కెట్లో రూ.1,618 పలకగా… రూ.1,367కే ఒక్క షేర్‌ను అమ్మాలని కేంద్రం నిర్ణయించుకుంది. మొదట మాత్రం 2.4 కోట్ల షేర్లనే అమ్మకానికి పెట్టింది. షేర్ల కొనుగోలుకు మొదట నాన్ రిటైలర్లకు అవకాశం కల్పించింది. డిసెంబర్ 11 నుంచి అందరికి అవకాశం కల్పించనుంది.