జంతువులను కూడా వ్యాపిస్తున్న కరోన వైరస్.

 


కరోనాతో ప్రపంచంలోని దేశాలు మొత్తం అల్లకల్లోలం అయ్యాయి. ఆర్థికంగా చితికిపోయాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. కార్మికులు, కూలీలు తిండి లేక తిప్పలు పడ్డారు. దీని భారిన పడి ఇప్పటికే చాలామంది మరణించారు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి విజృంభించిన ఈ మహమ్మారి మనుషులతో దారుణంగా ఆడుకుంటోంది. తాజాగా జంతువులకు సోకినట్లు నిర్దారణ అయింది. దీంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మొదటి సారిగా కరోనా వైరస్ ఓ అడవిజంతువుకు సోకింది. యూరప్, అమెరికాలో ఎక్కువగా కనిపించే మింక్ అనే జంతువుకు కరోనా సోకినట్లు అమెరికా వ్యవసాయ శాఖ గుర్తించింది. అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఇదే తొలి సార్స్-కోవ్ 2 కేసు. అమెరికా, ఐరోపా ఫార్మ్‌లలో ఇప్పటికే కరోనా వైరస్ ప్రబలడంతో లక్షాలాది మింక్‌లను చంపి పాతిపెట్టారు. గతంలో కొన్ని జూ జంతువుల్లో కూడా కరోనా లక్షణాలు బయటపడ్డ విషయం అందరికి తెలిసిందే.. కాగా ఇప్పటికే కరోనాను నిరోధించడానికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కోసం కసరత్తు చేస్తున్నాయి. మరికొన్ని దేశాలు వ్యాక్సిన్ రెడీ చేసి టీకాల రూపంలో ప్రజలకు అందిస్తోంది. వ్యాక్సిన్ రావడంతో ఇప్పడిప్పడే ఊపిరి పీల్చుకుంటున్న జనానికి మళ్లీ జంతువుల్లో కరోనా గుబులు పుట్టిస్తోంది. దీనివల్ల ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయోనని భయపడుతున్నారు.