కీలకం కానున్న ఐసీసీ టెస్టింగ్ ర్యాంక్స్.

 
అంతర్జాతీయ క్రికెట్‌లో ర్యాంకింగ్ అంటే వైకుంఠపాళి లాంటిది. వైకుంఠపాళిలో ఎప్పుడు ఏ జరుగుతుందో తెలియనట్లు.. ఇక్కడ కూడా అదే పంధా కొనసాగుతుంది. తాజాగా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్‌లో న్యూజిలాండ్ అగ్రస్థానానికి చేరుకుంది. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఆ టీమ్ బేసిక్ పాయింట్లు ఆసీస్ కంటే తక్కువ ఉన్నాయి. ఆస్ట్రేలియా 116. 461 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తాజాగా విండీస్‌పై 2-0 సిరీస్ దక్కించుకున్న న్యూజిలాండ్‌కు 116.375 పాయింట్లు వచ్చాయి. దీనితో ఆ జట్టు ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. దీనితో మరికొన్ని రోజుల్లో జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా, న్యూజిలాండ్-పాకిస్థాన్ సిరీస్‌లతో టెస్టుల్లో ఏ జట్టు అగ్రస్థానం దక్కించుకుంటుందన్న దానిపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి