మురుగదాస్ డైరెక్షన్ లో హాలీవుడ్ సినిమా.

 


ఇండియన్ సినిమా రేంజ్‌ పెరుగుతోంది. మన మేకర్స్‌ ఇంటర్‌నేషనల్‌ లెవల్‌లో బజ్‌ క్రియేట్ చేసే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. బాహుబలి లాంటి సినిమాలతో మన మేకింగ్ స్టాండర్డ్స్‌ కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రూవ్‌ అయ్యాయి. అందుకే ఇప్పుడు మన దర్శకులు హాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. లోకల్ సినిమాను గ్లోబల్‌ లెవల్‌కు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. సౌత్‌ స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌ హాలీవుడ్‌ ఎంట్రీ ఇప్పుడు ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ అయ్యింది. ఓ రీజినల్‌ మూవీ దర్శకుడికి హాలీవుడ్‌ సినిమా చేసేంత సీన్‌ ఉంటుందా..? అన్న అనుమానాలకు చెక్ పెట్టబోతున్నారు మురుగదాస్. అయితే గ్లోబల్‌ స్క్రీన్ మీదకు సౌత్‌ ఫస్ట్ ఎంట్రీ మురుగదాస్‌ది కాదు. మన టాలీవుడ్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి కూడా ఎప్పుడో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తెలుగు హిట్ ఆహ్వానం సినిమాను ‘డైవర్స్‌ ఇన్విటేషన్‌’ పేరుతో ఇంగ్లీష్ జనాలకు చూపించారు. అయితే ఆ ప్రయత్నం పెద్దగా వర్క్ అవుట్‌ కాలేదు. దర్శకుల కంటే ముందే నటులు ఇంగ్లీష్ సినిమా మీద మోజు పడ్డారు. బాలీవుడ్ స్టార్స్‌ చాలా మందే హాలీవుడ్ సినిమాల్లో నటించారు. సౌత్ నుంచి ‘క్విక్‌ గన్‌ మురుగన్‌’ సినిమాతో రాజేంద్ర ప్రసాద్‌.. ‘ద ఎక్స్‌ట్రాడినరీ జర్నీ ఆఫ్‌ ది ఫకీర్‌’ సినిమాతో ధనుష్ హాలీవుడ్ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశారు. ఈ సినిమాలు జస్ట్‌ చెప్పుకోవడానికే గానీ ఆ ఆర్టిస్ట్‌లకు హాలీవుడ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టలేకపోయాయి. ఇప్పుడు మురుగదాస్‌ కూడా హాలీవుడ్‌కు హాయ్ చెబుతున్నారు.. హాలీవుడ్ ప్రొడక్షన్‌ హౌస్‌ వాల్డ్ డిస్నీతో ఇప్పటికే డీల్‌ కూడా అయిపోందన్నది కోలీవుడ్ న్యూస్‌. కత్తి, తుపాకీ, సర్కార్‌ లాంటి సినిమాలు చేసిన మురుగదాస్‌ హాలీవుడ్ ఎంట్రీకి కూడా అలాంటి సబ్జెక్ట్‌నే పిక్ చేశారు. అయితే హాలీవుడ్‌ మూవీ కదా.. అందుకే రెగ్యులర్‌ స్టైల్‌ కాకుండా లైవ్ యాక్షన్ మూవీని ప్లాన్ చేస్తున్నారు మురుగదాస్‌. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయినట్టుగా టాక్‌ నడుస్తోంది. ఈ మూవీ కోసం ఇండియన్ యానిమేటర్స్‌తో పాటు హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్‌ వర్క్‌ చేస్తున్నారట. దర్బార్‌ సినిమాతో నిరాశపరిచిన మురుగదాస్‌… హాలీవుడ్ సినిమాతో ఆకట్టుకుంటారా..? అసలు హాలీవుడ్ ఆడియన్స్ మురుగదాస్ మార్క్ టేకింగ్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారు.. చూడాలి మరి.