ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం.

 


నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరగనుంది. దేశంలో నెలకొన్న కరోనా వైరస్ పరిస్థితులపై చర్చించేందుకు అన్ని రాజకీయ పార్టీలతో వర్చువల్ విధానంలో మీటింగ్ నిర్వహించబోతున్నారు మోదీ. దేశంలోని అన్ని పార్టీల పార్లమెంటరీ నేతలు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు బీజేపీ ముఖ్య నేతలు ఈ మీటింగ్ లో పాల్గొననున్నారు. ప్రస్తుతం ప్రయోగ దశల్లో ఉన్న పలు వ్యాక్సిన్ల గురించి చర్చించే అవకాశం ఉంది. సమావేశం ఆఖరులో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. సమావేశం అనంతరం వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన వెలువడే ఛాన్స్‌ ఉంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తున్న కోవ్యాగ్జిన్, పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ది చేస్తున్న కోవీషీల్డ్ వ్యాక్సిన్లను పరిశీలించారు. యూకె, రష్యా వంటి దేశాలు ఎమర్జెన్సీ వ్యాక్సిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ ఎమర్జెన్సీ వ్యాక్సిన్‌పై అనుమతులేమైనా ఇచ్చే అవకాశం ఉందనేది సమావేశం అనంతరం తేలనుంది. రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీపై ఎంపీలకు ప్రధాని కీలక సూచనలు చేసే అవకాశం ఉంది.