మళ్లీ స్వల్పంగా పెరిగిన బంగారం ధర.

 


బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల ధర రూ.10 పెరిగింది. దేశ వ్యాప్తంగా బంగారం ధర డిసెంబర్ 25న రూ. 48,710 ఉండగా.. నేడు అది రూ.48,720కి పెరిగింది. వారం రోజుల వ్యవధిలో ధర రూ. 700 పడిపోగా… కేవలం రూ.20 పెరుగుదలను నమోదు చేసింది. ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు ఇలా…. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కాగా… 24 క్యారెట్ల బంగారం ధర 51,600గా ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల ధర రూ.46,700 ఉండగా… 24 క్యారెట్ల ధర 50,940గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 48,720,కాగా 24 క్యారెట్ల ధర 49,720. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర 48,780 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర 53,210గా నమోదైంది.