ఎల్ఆర్ఎస్ ‌పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.

 


ఎల్ఆర్ఎస్ అంశంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గింది. ఎల్ఎస్ఆర్ లేని ప్లాట్లకు కూడా రిజిస్ట్రేషన్లు చేయాలని ఆదేశించింది. అయితే కొత్తగా వేసిన లేఅవుట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేరిట ఇవాళ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఇంతకుముందే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌పై వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎల్ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా, ఎల్ఆర్ఎస్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.