ట్వీట్ పై ఫైట్.

 


కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ప్రభుత్వంలోని మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. రైతుల ఉద్యమానికి వేర్పాటువాదులంటూ ఆపాదించడం తగదని హితవు పలికారు. రైతులను ఖలిస్తాన్ ఏజెంట్లు, చైనా , పాకిస్తాన్ ఏజెంట్లు, మావోయిస్టులు అనడం ఆక్షేపణీయమని ట్వీట్ చేశారు. రైతులు వేర్పాటు వాదులైతే మరి వారితో ఇన్ని ధపాల చర్చలెందుకుని అన్నారు. లక్షలాది మందీ వేర్పాటు వాదులేనా అని ప్రశ్నించారు. కాగా… కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా రైలు ఆందోళనలు చేస్తున్నారు. అన్నదాతల ఆందోళనలు 18వ రోజుకు చేరుకున్నాయి. కేంద్ర వైఖరిని నిరసిస్తూ… రైతులు డిసెంబర్ 14న పెద్ద ఎత్తున ధర్నాలు, టోల్ ప్లాజాల వద్ద నిరసనలకు పిలుపునిచ్చారు.