వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.

 


What’s App: గత కొద్ది రోజులుగా ప్రముఖ మెసేజింగ్ సంస్థ వాట్సాప్ తన యూజర్లకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. తాజాగా మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదేంటంటే.. మనం ఇతరులతో ఛాటింగ్ చేసేటప్పుడు ప్రతీ చాట్ పేజీకు ఒక కొత్త వాల్ పేపర్ ను సెట్ చేసుకునే ఫీజర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందుకు ప్రత్యేకంగా ఒక వాల్ పేపర్ గ్యాలరీని కూడా అప్ డేట్ చేసింది. అదేవిధంగా ప్రతీ యూజర్ టెక్ట్స్ లేదా ఎమోజీల సహాయంతో కొత్త స్టిక్కర్‏ను వెతికే ఫీచర్‏ను కూడా తీసుకురానున్నట్లు తెలిపింది. వాట్సాప్ తీసుకువస్తున్న ఈ కొత్త ఫీచర్స్ కాంటాక్ట్స్‏కు లేదా గ్రూప్స్‏కు కొత్త వాల్ పేపర్లను సెట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సహాయంతో యూజర్ తన ఛాట్‏లను గుర్తించడం సులభం అవుతుంది. అంతేకాకుండా పొరపాటును వేరే చాట్‏ను సెలెక్ట్ చేసుకోవాడాన్ని ఆపుతుంది. “కస్టమ్ వాల్ పేపర్” ఉపయోగించడం ద్వారా ప్రతీ వ్యక్తిగతంగా, చాలా రకాలుగా మార్చుకోవడంతోపాటు, ఛాటింగ్‍‏లలో పొరపాట్లు జరగదు. ప్రసుతం ఈ వాల్ పేపర్‏ను సెట్ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ అన్ని కాంటాక్టులకు ఒకే రకమైన వాల్ పేపర్ వర్తిస్తుంది. తాజా ఈ కొత్త ఫీచర్ ప్రకారం వాట్సాప్ ఛాట్‏లలో లైట్, డార్క్ మోడ్ సెటింగులతో కూడిన ప్రత్యేక వాల్ పేపర్‏లను ఎంచుకోవచ్చు. ప్రస్తుతానికి యూజర్లు తమ వాట్సాప్ కాంటాక్ట్ వాల్ పేపర్ సెట్ చేసుకోవడానికి ముందుగా యాప్‏లో ఉన్న సెట్టింగ్ ఆప్షన్‏ను ఎంచుకోవాలి. అనంతరం అందులోని వాల్ పేపర్ ఆప్షన్లోకి వెళ్ళి వారి స్మార్ట్ ఫోన్ గ్యాలరీ నుంచి ఏదైనా ఫోటోను సెలెక్ట్ చేసుకొని స్టాటిక్ వాట్సాప్ వాల్ పేపర్‏గా మార్చుకోవచ్చు. అయితే ఈ కొత్త ఫీచర్‏ను పొందాలంటే మాత్రం యూజర్లు సంబంధిత ఛాట్‏ను తెరవడం ద్వారా ప్రతీ ఛాట్‏తో వేర్వేరు వాల్ పేపర్లను ఎంచుకోవచ్చు. దీనికి వాట్సాప్‏లో ఉండే ఆప్షన్‏లోకి వెళ్ళి వాల్ పేపర్‏ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ ఫోన్ గ్యాలరీలో నుంచి మీకు నచ్చిన వాల్ పేపర్‏ను సెలక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ వాట్సాప్ వెబ్‏లో కాకుండా మొబైల్‏లో మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.