డోపింగ్​ పరీక్షల్లో దొరికిపోయిన భారత ఆటగాడు.

 


డోపింగ్‌లో మరో ఆటగాడు దొరికిపోయాడు. అయితే ఈ సారి మన భారత ఆటగాడు దొరికి పోవడం సంచలనంగా మారింది. భారత్​ నుంచి ఎన్​బీఏకు ఎంపికైన తొలి ఆటగాడు సత్నామ్​సింగ్​పై నాడా రెండేళ్ల నిషేధం విధించింది. డోపింగ్​ పరీక్షల్లో అతడు విఫలమవడమే ఇందుకు కారణం. అయితే.. బాస్కెట్ బాల్​ క్రీడాకారుడు సత్నామ్​సింగ్​పై జాతీయ మాదక ద్రవ్య నిరోధక సంస్థ (NADA) రెండేళ్ల పాటు నిషేధం విధించింది. డోపింగ్​ పరీక్షల్లో అతడు విఫలమైనట్లు గురువారం వెల్లడించింది. జాతీయ బాస్కెట్​బాల్​ సంఘం (NBA)కు భారత్​ నుంచి ఎంపికైన తొలి ఆటగాడు సత్నామ్​ సింగ్. డల్లాస్ మేవెరిక్​ జట్టు తరఫున ఆడుతాడు ఈ పంజాబీ ఆటగాడు. అయితే డోపింగ్‌లో పట్టుండిన తర్వాత పంజాబ్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఇంతవరకు స్పందించలేదు.