సింహం వెంబడించిన ఇద్దరు.

 


ఎవరైనా సింహాన్ని చూస్తే జడుసుకుంటారు. జూకు వెళ్లినా సింహం బోనుకు కొద్ది దూరంగా ఆగిపోతారు. అయితే ఓ ఇద్దరు ఆకతాయిలు సింహాన్నే వెంబండించారు. తాము చేస్తున్న పనిని వీడియో తీశారు. షేర్ చేశారు. అది కాస్తా వైరల్‌గా మారడంతో ఇప్పుడు వారు ఊచలు లెక్కపెడుతున్నారు. వారిపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే… గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. జునాగర్ జిల్లాలో గిర్ అటవీ ప్రాంతంలో ఉన్న సింహాన్ని ఇద్దరు యువకులు బైక్‌పై వెంటాడారు. వారు చేసిన పనిని వీడియో తీశారు. అయితే, ఆ వీడియో వైరల్‌గా మారింది. చివరకు అటవీ శాఖ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో జునాగర్ జిల్లా అటవీ శాఖ అధికారి దుష్యంత్ ఈ ఘటనపై స్పందించారు. యువకులు సింహాన్ని వెంటాడిన వీడియో తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ ఇద్దరిని పట్టుకుని, కేసు కూడా నమోదు చేశామని అన్నారు. త్వరలో కోర్టు ముందు కూడా హాజరు పరుస్తామని తెలిపారు