రైతు భరోసా విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా?హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్ చేయండి.

 


ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి మంగళవారం రూ.1,766 కోట్లను జమ చేశారు. ‘వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్’ పధకం మూడో విడత నిధులు రూ. 1,120 కోట్లతో పాటు.. అక్టోబర్‌లో నివర్ తుఫానుతో నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ సొమ్ము రూ. 646 కోట్లను సైతం చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ‘వైఎస్సార్ రైతు భరోసా’కు సంబంధించిన స్టేటస్ తెలుసుకునేందుకు అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఎలాంటి సమాచారం లేదు. అందువల్ల మూడో విడత సొమ్ము బ్యాంక్ ఖాతాల్లోకి పడిందో.? లేదో.? తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేసింది. రైతు భరోసా విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా 155251 హెల్ప్‌లైన్‌ నెంబర్‌కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని సూచించింది