వ్యాక్సిన్ పై రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం .

 


దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తుగా 60ఏళ్లు పైబడిన వారికీ ఇకపై స్పుత్నిక్‌ టీకాను అందించేందుకు రష్యా అనుమతించింది. రష్యాలో అత్యవసర వినియోగం కింద స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు రెండు లక్షలమందికి పైగా టీకాను పంపిణీ చేశారు. అయితే, అందులో 60ఏళ్లు పైబడిన వారికి టీకాను అవసరంలేదని తెలిపింది. రష్యా వ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతుండటంతో దేశంలోని అన్ని ప్రాంతాలకు ఇప్పటికే టీకాలను పంపిణీ జరుగుతుంది. అయితే, తాజాగా రష్యా ప్రభుత్వం వయసు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు వయసు పైబడినవారిపై ఈ టీకాను విడిగా పరీక్షించారు నిపుణులు. ఈ ప్రయోగ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు నమోదు చేయడంతో రష్యా ఆరోగ్య శాఖ మంత్రి టీకాను అందరికీ అనుమతిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. కాగా, స్పుత్నిక్‌-వి టీకా ఎగుమతికి సంబంధించి రష్యా ఇప్పటికే చాలా దేశాలతో ఒప్పందాలు చేసుకుంది. ఇందులో భాగంగా రష్యా ప్రభుత్వం 3 లక్షల స్పుత్నిక్‌ టీకాలను అర్జెంటీనాకు అందించింది. అలాగే బెరారస్‌తో పాటు మరికొన్ని దేశాలకు కూడా వ్యాక్సిన్ అందించేందుకు రష్యా సిద్ధమవుతోంది.