మీకు ఉదయాన్నే నిమ్మకాయ రసం తాగితే అలవాటుందా........?

 


ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నిమ్మరసం కలిపిన నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిదని చాలా మంది చెబుతుంటారు. గోరువెచ్చని నీళ్ళలో నిమ్మరసం కలుపుకొని తాగితే కలిగే లాభాలెంటో తెలుసుకుందాం. ఉదయాన్నే నిమ్మరసం కలిసిన నీళ్ళు తాగితే శరీరం హైడ్రేట్‏గా ఉంటుందట. అంతేకాకుండా నిమ్మకాయలో ఉండే నీటిశాతం వల్ల శరీరానికి సరైన శాతం నీరు అందుతుంది. నిమ్మలో విటమిన్ సి అంతేకాకుండా అందులో ఉండే ఆంటి ఆక్సిడెంట్ల వల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటయట. ఇంకా, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. మలబద్దకం ఉన్నవారు నిమ్మరసం  కలిపిన నీళ్ళు తాగితే మంచి ఉపశమనాన్ని పొందుతారు. అంతే కాకుండా నిమ్మరసంలో మెంతులు కలుపుకొని తాగితే బరువు తగ్గుతారట. బరువు తగ్గాలనుకునే వారు తమ రోజు వారి డైట్‏లో ఖచ్చితంగా నిమ్మరసం నీళ్ళు ఉంచుకోవాలట. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు రోజు నిమ్మరసం నీళ్ళు తాగి ఆరోగ్యంగా ఉండాండి