స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రం ఆమోదం.

 


స్పెక్ట్రమ్ తదుపరి వేలానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ వేలాన్ని మార్చిలో నిర్వహించనున్నారు. ఆ వేలంలో 2,251 మెగా హెట్జ్ లను విక్రయిస్తారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అయితే 5 జీ సర్వీసులుగా ఐడెంటిఫై చేసినవాటిని స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీలలో అమ్మకానికి పెట్టబోమని స్పష్టం చేశారు. 700 ఎం హెచ్ జెడ్, 800, 900, 2,100, 2,300, 2,500 ఎం హెచ్ జెడ్ ల బాండ్లను వేలానికి పెట్టడం జరుగుతుందని ఆయన చెప్పారు. దరఖాస్తులకు సంబంధించి ఈ నెలలోనే నోటీసును జారీ చేస్తామన్నారు. రూ. 5.22 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ వేలాన్ని టెలికం శాఖలోని డిజిటల్ కమ్యూనికేషన్ గత మే నెలలోనే ఆమోదించింది. ఇందులో 5 జీ సర్వీసుల రేడియో వేవ్స్ కూడా ఉన్నాయి. రూ. 3.92 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ డాట్ లో వినియోగం లోకి రాకుండా ఉన్నట్టు రిలయన్స్ జియో తెలిపింది. ఇక రూ. 3,500 కోట్ల షుగర్ ఎక్స్ పోర్ట్ సబ్సిడీని కూడా కేంద్రం ఆమోదించింది.