మూగజీవాలను సైతం వదలని కరోనా వైరస్.

 


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మనషులతో పాటు జంతువులను సైతం వదలడంలేదు. స్పానిష్ జూపార్క్‌లోని నాలుగు సింహాలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు జూ అధికారులు వెల్లడించారు. బార్సిలోనా జూపార్క్‌లోకి నిత్యం సందర్శకులు వస్తుండటంతో అందులోని నాలుగు సింహాలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో వాటికి కొవిడ్-19 పాజిటివ్‌గా తేలిందని పశు వైద్యాధికారులు తెలిపారు. జాలా, నిమా, రన్ రన్, కింబే అనే నాలుగు సింహాలలో కరోన వైరస్ స్వల్ప లక్షణాలు కనిపించామని జూపార్కు కీపర్లు చెప్పారు. సింహాలకు కరోనా సోకడంతో జూపార్కులో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో జూపార్కు ఉద్యోగుల్లో ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. సింహాలకు జూ సిబ్బంది ద్వారానే కరోనా సోకిందనట్లు అధికారులు తేల్చారు. ఏప్రిల్ నెలలో న్యూయార్క్‌లోని బ్రోంక్స్ జూపార్క్‌లో మూడు పులులు, నాలుగు సింహాలకు కరోనా బారినపడి అవి కోలుకున్నాయి. అక్టోబరులో యూఎస్ టేనస్సీలోని జూలో పిల్లలతో సహా పులికి వైరస్ సోకింది. కరోనా సోకిన సింహాలకు పశువైద్య సంరక్షణ శాఖ అధికారులు చికిత్స అందిస్తున్నారు.