విశాఖపట్నం లో రెచ్చిపోయిన స్మగ్లర్లు.

 


విశాఖపట్నంలో స్మగ్లర్లుపోలీసులు గుట్టు చప్పుడుకాకుండా తరలిస్తున్న గంధపు చెక్కలను పట్టుకున్నారు. రోజూవారి తనిఖీల్లో భాగంగా పోలీసులు నేడు చోడవరంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఇంతలో ఓ ఫోర్డ్ కారు వచ్చింది. అందులోని మనుషులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారి కారును తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 108 కేజీల బరువైన గంధపు చెక్కలు పట్టుబడ్డాయి. పోలీసులు ఆ గంధం చెక్కలను స్వాధీనం చేసుకుని, వారు ప్రయాణిస్తున్న కారును సీజ్ చేశారు. గంధపు చెక్కలను స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, విశాఖ ఏజెన్సీ కు నుండి హైదరాబాద్‌కు ఈ గంధపు చెక్కలను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్మగ్లింగ్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు