మేఘా ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్ ట్రయిల్ రన్.‌

 


మేఘా ఇంజనీరింగ్ అనుబంధ సంస్థ తయారు చేసిన ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్ ట్రయిల్ రన్‌ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేది సింఘ్ రావత్ లాంఛనంగా ప్రారంభించారు. డిసెంబర్ 11న తన అధికార నివాసంలో జెండా ఊపి బస్సును ప్రారంభించారు. అనంతరంలో బస్సులో ముఖ్యమంత్రి ప్రయాణించారు. కాగా, మేఘా సంస్థ ప్రతినిధులు ఎలక్ట్రిక్ బస్సు ప్రత్యేకతలను ముఖ్యమంత్రికి వివరించారు. డెహ్రడూన్ స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా డూన్ కనెక్ట్ పేరుతో ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం నడుపుతోందని ముఖ్యమంత్రి రావత్ తెలిపారు. 30 ఎకో ఫ్రెండ్లీ బస్సు సర్వీసులను వినియోగించుకోనున్నట్లు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రత్యామ్నాయ వనరులను వినియోగించుకోవాలని సూచించారు. డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్, హరిద్వార్ సహా రాష్ర్టంలోని పలు ప్రముఖ కేంద్రాల్లో ఈ బస్సు సర్వీసులను నిర్వహించనున్నామని తెలిపారు.