నిర్మాతగా మారిన రియల్ హీరో సోనుసూద్.

 


ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు సోనూసూద్. కానీ తెరపై అన్ని విలన్ పాత్రలు మాత్రమే వచ్చాయి. కానీ ఏ మాత్రం నిరాశ పడకుండా విలన్ పాత్రల్లో నటించి తన ప్రతిభను చూపించాడు. వెండితెరపై హీరో కాలేకపోయినా కానీ కరోనా ప్రభావంతో నిజజీవితంలో మాత్రం రియల్ హీరో అయ్యాడు. లాక్ డౌన్ ప్రభావంతో ఇబ్బందులు పడ్డ వలస కార్మికులకు తన వంతు సహయం చేశాడు. అంతేకాకుండా పేదప్రజలకు, విద్యార్థులకు సహయం చేసి అందిరి ప్రేమాభిమానలను సొంతం చేసుకున్నాడు ఈ రియల్ హీరో. తాజాగా సోనూసూద్ నిర్మాతగా అవతరించబోతున్నారట. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని అంగీకరించారు. మీరు నిర్మాతగా మారబోతున్నారా ? అని ప్రశ్నించగా.. “అవును నిజమే. నిర్మాతగా నేను మారబోతున్నాను. ఇందుకు సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయి. ప్రజలలో స్పూర్తిని నింపే కథల కోసం వెతుకుతున్నాను. అన్ని కుదిరితే తొందర్లోనే నటుడిగా, నిర్మాతగా మీ ముందుకు వస్తాను” అని సోనూసూద్ అన్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో సోనూసూద్‏కు ప్రజల్లో ఉన్న అభిమానం చూసి ఆయనకు విలన్ వేషాలు వేయించేందుకు దర్శకనిర్మాతలు ఆలోచిన్నారట. తెలుగులో సోనూ నటిస్తున్న సినిమాలకు ఆయన పాత్రల్లో కొన్ని మార్పులు కూడా చేసారట.