తిరుమల లో నేటి నుండి శ్రీవారి లడ్డూల విక్రయం.

 


కరోనా మహమ్మారి అన్ని సంస్థల పైన, అన్ని రంగాల పైన చివరకు ఆలయాలపైనా కూడా తీవ్రప్రభావం చూపింది. కరోనా కారణంగా దేశంలోని ఆలయాలను మూసివేసిన విషయం విదితమే. ఆతర్వాత పరిస్థితులు చక్కబడుతున్న తరుణంలో ఆలయాలను తెరిచారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. తగు జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులను ఆలయాలకు అనుమతిస్తున్నారు అధికారులు, అర్చకులు. కరోనా కారణంగా తిరుమల శ్రీవారి లడ్డూల విక్రయం నిలిపివేసిన విషయం తెలిసిందే. కరోనా, ఆతర్వాత ఏర్పడ్డ పరిస్థితుల దృష్ట్యా శ్రీవారి లడ్డూ విక్రయాన్ని అధికారులు నిలిపివేశారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ తిరిగి లడ్డూ విక్రయాన్ని తిరిగి మొదలు పెట్టనున్నారు ఆలయ అధికారులు. శనివారం నుంచి లడ్డూలను విక్రయిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ లోని లిబర్టీలోని టీటీడీ బాలాజీభవన్‌తోపాటు జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ప్రాంగణంలో కూడా తిరుమల శ్రీవారి లడ్డూలను విక్రయించనున్నారు. లడ్డూలతో పాటుగా నూతన సంవత్సర క్యాలెండర్లను, డైరీలను కూడా విక్రయించనున్నారు