ప్రభాస్ "ఆదిపురుష్ "సినిమాను మొదలుపెట్టిన దర్శకుడు ఓం రావత్


 

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాల్లో ఆదిపురుష్ కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడుగా కనిపించనున్నాడని మొదటినుంచి ప్రచారం జరుగుతుంది. రామాయణం ఇతివృత్తంగా రూపొందబోతుందని చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా కనిపించడంలేదు. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయిందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నాడు, ఆ సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలన్నింటి తరవాత ఆదిపురుష్ లో నటిస్తాడని అంటున్నారు. అయితే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. దాంతో ముందుగా వీఎఫ్ఎక్స్ వర్క్ ను మొదలు పెట్టనున్నారు. ప్రపంచ ప్రసిద్ది గాంచిన రెండు ప్రముఖ వీఎఫ్ఎక్స్ కంపెనీలు ఆదిపురుష్ కోసం ఇప్పటికే పనులు మొదలు పెట్టాయని తెలుస్తుంది. ఈ సినిమాకు ఖర్చు చేసే బడ్జెట్ లో ఎక్కువ శాతం వీఎఫ్ఎక్స్ కు ఉపయోగించనున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ గా కనిపించబోతున్నాడు. త్వరలోనే చిత్రయూనిట్ ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన వివరాలు తెలిపే అవకాశాలు ఉన్నాయి.