బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా తడబడుతోంది. మొదటి ఇన్నింగ్స్‌లో పేలవ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే తీరును కొనసాగిస్తున్నారు. 101 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ మాథ్యూ వేడ్(40), లబూషన్(28) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. ప్రస్తుతానికి ఆసీస్ ఇంకా 29 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. క్రీజులో గ్రీన్(1), కమ్మిన్స్(2) ఉన్నారు. ఇప్పటివరకు భారత బౌలర్లలో బుమ్రా, ఉమేశ్, సిరాజ్, అశ్విన్ తలా ఓ వికెట్ పడగొట్టగా.. జడేజా రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దాదాపుగా రెండో టెస్టులో టీమిండియా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది