కరోనా వైరస్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పిన ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు

 


కరోనా వైరస్ ప్రపంచాన్నే వణికిస్తోంది. కరోనా దెబ్బకు ప్రజలు ప్రాణాలు గుపెట్లో పెట్టుకొని జీవిస్తున్నారు. ఎటునుంచి ఈ మహమ్మారి వ్యాపిస్తుందో తెలియక బ్యాబ్రాంతులకు గురవుతున్నారు. కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అంటూ.. దేశాలన్నీ వేయికళ్లతో ఎదురుచూస్తున్నాయి. ఇక కరోనా వైరస్ ప్రభావం రోగులపై ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే పలువురు వైద్యులు చెప్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల పై ఎక్కువ ప్రభావం చూపే ఈ వైరస్ ఆస్థమాతో సతమతమయ్యే వారిపై మాత్రం ఎక్కువ ప్రభావం చూపదట. ఇజ్రాయిల్ లో జరిపిన ఓ పరిశోధనలో ఈ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్‌కు చెందిన హెల్త్ మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్‌లోని ఆధారంగా శాస్త్రవేత్తలు ఆస్థమా రోగులపై అధ్యయనం జరిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకూ కరోనా బారిన పడ్డన 37 వేల మందిపై జరిగిన ఈ పరిశోధనలు జరుపగా పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. పరిశోధన జరిపిన కరోనా రోగుల్లో ఆస్తమా ఉన్న వారి సంఖ్య కేవలం 6 శాతంగా ఉన్నట్టు తేలింది. దీంతో..ఆస్తమా రోగులకు కరోనా సోకే అవకాశం తక్కువనే అంచనాకు వచ్చారు శాస్త్రవేత్తలు అయితే ఈ పరిశోధనలో పాల్గొన్న మరో శాస్త్రవేత్త యూజీన్ మెర్జాన్ మాత్రం తమకు కరోనా సోకే అవకాశం ఎక్కువవుందన్న భయంతో ఆస్తమా రోగులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ఉంటారని అందువల్లే వారి సంఖ్య తక్కువ ఉండి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో వైపు ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగుల సమాచారం ఆధారంగా తాము ఈ అంచనాకు వచ్చామని మిగిలిన పరిశోధకులు చెబుతున్నారు.