బైడెన్ బృందంలో మరో భారతీయుడు.

 


మరో భారతీయుడు అమెరికా కొత్త ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు. త్వరలో అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టబోతున్న జో బైడెన్ వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ప్రవాస భారతీయుడు వేదాంత్ పటేల్ ను నియమితులయ్యారు. బైడెన్ శిబిరంలో పటేల్ సీనియర్ అధికార ప్రతినిధిగా వ్యవహరించనున్నారు. బైడెన్ కోసం ప్రచారవర్గంలో రీజనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గాను, అంతకుముందు నెవాడా-వెస్టర్న్ ప్రైమరీ స్టేట్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా వేదాంత్ పనిచేశారు. అంతకుముందు ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఎంపీ ప్రమీలా జయపాల్ కు కూడా ఇదే హోదాలో డైరెక్టర్ గా ఆయన వ్యవహరించారు. ఇండియాలో పుట్టి కాలిఫోర్నియాలో పెరిగిన వేదాంత్ పటేల్.. ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్, ప్రెస్ స్టాఫ్ కోసం బైడెన్ ప్రకటించిన 16 మందిలో పటేల్ కు చోటు దక్కింది. ఈ టీమ్ అంతా వివిధ రంగాల్లో ప్రతిభగలవారని వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ తెలిపారు.