సోనూసూద్ కు అగ్రస్థానం.

 


లాక్‏డౌన్ సమయంలో వలస కార్మికులకు సహయం చేసిన నటుడు సోనూ సూద్‏కు అరుదైన గౌరవం దక్కింది. 2020లో ప్రపంచంలో టాప్ 50 ఆసియన్ సెలబ్రిటీల జాబితాలో సోనూసూద్ నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. యూకేలోని ఈస్టర్న్ ఐ అనే వార్త పత్రిక ఈ విషయాన్ని ప్రచురించింది. ఎంటర్ ట్మైనెంట్ ఎడిటర్ అస్‏జాద్ నాజిర్ నిర్వహించిన ఈ సర్వేలో మొదటి స్థానంలో సోనూసూద్, రెండో స్థానంలో కెనడా సోషల్ మీడియా స్టార్ లిల్లీ సింగ్ నిలిచారు. అటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‏కు 7వ స్థానం దక్కింది. ఈ పత్రిక ఇలాంటి జాబితాను విడుదల చేయడం ఇదే తొలిసారి. దీనిపై సోనూ సూద్ స్పందిస్తూ.. “నా శ్రమను గుర్తించినందుకు ఈస్టర్న్ ఐ పత్రికకు ధన్యవాదాలు. కరోనా సమయంలో నా బాధ్యతగా నేను నా దేశ పౌరులకు అండగా నిలబడ్డాను. ప్రజలు నాపై చూపించిన ప్రేమ, అప్యాయతలు అందించారు. ఈ కార్యక్రమాలను నా చివరి శ్వాస వరకు చేస్తూనే ఉంటాను” అని అన్నారు.