పాక్ పై ఫైర్.

 


భారత్‌లో అలజడులు సృష్టించడమే లక్ష్యంగా పాకిస్తాన్ పని చేస్తోందని, తీవ్రవాదులకు శిక్షణ ఇవ్వడం, వారిని దేశంలోకి పంపి అశాంతిని రేపే ప్రయత్నానికి పాకిస్తాన్ పాల్పడుతోందని జమ్మూ కాశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ఆరోపించారు. అంతర్జాతీయ సమాజంలో పాక్ పాల్పడుతున్న దుశ్చర్యలను నిరూపించేందుకు అన్ని సాక్ష్యాధారాలున్నాయని ఆయన అన్నారు. జమ్ములో జరుగుతున్న డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకే పాకిస్తాన్ తీవ్రవాదులను భారత్‌లోకి ఇటీవల పంపిందని స్పష్టం చేశారు. కాగా, డిస్ట్రిక్ట్ ఎన్నికల సందర్భంగా శ్రీనగర్‌లో మన్జూర్ అహ్మద్ అనే సెక్యూరిటీ ఆఫీసర్ ఇటీవల ఉగ్రదాడిలో మరణించారు. తాజాగా పుంచ్‌లో సైతం తీవ్రవాదులు దాడికి దిగగా… భారత సైనికులు ఎన్‌కౌంటర్ చేశారు. అయితే రెండు అగ్రదాడుల లక్ష్యం ఎన్నికల ప్రశాంతతను చెడగొట్టడమే అని డీజీపీ సింగ్ అన్నారు.