డబుల్ బెడ్రూం ఇళ్లు కిరాయికి ఇస్తే కఠిన చర్యలు తప్పవు----మంత్రి హరీష్‌రావు.

 


డబుల్ బెడ్రూం ఇళ్లు కిరాయికి ఇస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హరీష్‌రావు హెచ్చరించారు. డబుల్ బెడ్రూం ఇళ్లను విక్రయించొద్దని, ఒకవేళ ఇళ్లు విక్రయించినట్లు తెలిస్తే ఆ ఇళ్లను తిరిగి స్వాధీనం చేసుకుంటామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ తరహాలో సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తున్నామని తెలియజేశారు. పేద వారికి నయా పైసా ఖర్చు లేకుండా… నూతన వస్త్రాలు బహుకరించి మరీ గృహ ప్రవేశాలు జరిపిస్తున్నామని వివరించారు.