గ్రేటర్ ఎన్నికల్లో కారు జోరు.

 


ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు స్పీడుకు బ్రేకులు లేకుండా పరిగెడుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది. ఈ ఎన్నికల్లో బోరబండ నుంచి పోటీ చేసిన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ రెండోసారి గెలిచారు. 2015లో బోరబండ నుంచి గెలిచి డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు చేపట్టిన బాబా.. వరుసగా రెండోసారి గెలుపొందారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ 71, బీజేపీ 37, ఎంఐఎం 37 స్థానాల్లో ముందజలో ఉన్నాయి. కాంగ్రెస్‌ కేవలం మూడు స్థానాలకే పరిమితమైనట్లుగా కనిపిస్తోంది.