తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక.


 

తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక. డిసెంబర్ 7వ తేదీ నుంచి రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించనున్నట్లు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు. కరోనా వైరస్ దృష్ట్యా విద్యార్థులకు ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 8వ తేదీలోగా స్టూడెంట్స్ ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. కాగా, దోస్త్ ప్రత్యేక విడత కౌన్సిలింగ్‌లో 27,365 సీట్లను కేటాయించినట్లు కన్వీనర్ లింబాద్రి పేర్కొన్నారు.