ఏపీ లో ఇళ్ల పట్టాల పంపిణీ కి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నేరవేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. “నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు” కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో శ్రీకారం చుట్టారు. లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు.యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలోని వైఎస్సార్‌ జగనన్న కాలనీలో మోడల్‌ హౌస్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా “నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు” పైలాన్‌ను ఆవిష్కరించారు. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో 30 లక్షల మందికి పైగా నివాస స్థల పట్టాలను అందించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ ఇళ్ల నిర్మాణం మూడేళ్లలో పూర్తి చేయాలని భావిస్తున్నారు.