ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండ.

 


జార్జియా: సముద్రంలో మంచుకొండలు (ఐస్‌బర్గ్స్‌) సర్వసాధారణంగా కనిపిస్తాయి. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద మంచుకొండను దక్షిణ జార్జియా ద్వీపం సమీపంలో ఆర్‌ఎఎఫ్‌ విమానం తన కెమెరాలో బంధించింది. ఈ ఐస్‌బర్గ్‌ ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. మంచుకొండ విరిగిపోతుండగా గమనించిన ఏ400ఎం నిఘా విమాన సిబ్బంది ఈ చిత్రాలను బంధించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నవి అతిపెద్ద మంచుకొండ ముక్కలు. ఈ మంచుకొండ 4,200 చదరపు కిలోమీటర్లు ఉందట. ఇది సుమారుగా లండన్‌లోని సోమర్సెట్ అంత పరిమాణంలో ఉందట. ఈ మంచుకొండకు ఏ68ఏ అని పేరు పెట్టారు. ఇది దక్షిణ జార్జియా ద్వీపం నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉందట. శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ మంచుకొండ లోతులేని నీటిలో చిక్కుకునే అవకాశం ఉంది. ఇది పర్యావరణ వ్యవస్థకు ముప్పు కలిగిస్తుంది.