టీమిండియా ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ రికార్డ్.

 


ఆస్ట్రేలియా భారత్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్ ద్వారా భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో ఇప్పటి వరకు ఉన్న శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌ రికార్డును బద్దలుకొట్టాడు. టెస్టు మ్యాచుల్లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ల వికెట్లు తీసిన జాబితాలో మురళీధరన్ 191 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా…ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో అశ్విన్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. అశ్విన్ ఇప్పటి వరకు 192 మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ల వికెట్లు సాధించాడు. కాగా టెస్టుల్లో అశ్విన్ ఇప్పటి వరకు 375 వికెట్లు పడగొట్టాడు. టాప్ 5 వీరే… ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ హాజిల్ వుడ్ ను అవుట్ చేసి 192 మంది లెఫ్ట్ హ్యాండర్స్‌ను అవుట్ చేసిన రికార్డు అశ్విన్ నమోదు చేశాడు. అంతకు ముందు శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్ 191 వికెట్లు పడగొట్టిన మొదటి స్థానంలో ఉండేవాడు. ప్రస్తుతం ఆయన రెండో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లాండ్ ఫేసర్ జేమ్స్ అండర్సన్ 186 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు గ్లెన్ మెక్ గ్రాత్ 172, షేన్ వార్న్ 172తో నాలుగో స్థానంలో సంయుక్తంగా ఉండగా.. ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే 167వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు.