గూగుల్ నుంచి కొత్త యాప్.

 


గూగుల్ నుంచి ఓ కొత్త యాప్ వచ్చింది. లుక్ టు స్పీక్ (Look to Speak) అనే ఈ యాప్ ద్వారా కళ్లతోనే చాట్ చేసే అవకాశం యూజర్లకు కలుగుతుంది. ముఖ్యంగా మాట్లాడలేని వారిని దృష్టిలో ఉంచుకొని గూగుల్ ఈ యాప్‌ను డెవలప్ చేసింది. తమ ఫోన్లలో ఉండే కొన్ని పదాలను కళ్లతో చూస్తే.. దానిని గట్టిగా చదివి వినిపిస్తుంది ఈ యాప్‌. గూగుల్‌లో ఇలాంటి ప్రాజెక్ట్‌పైనే పని చేస్తున్న ఓ టీమ్‌.. స్పీడ్‌, లాంగ్వేజ్ థెరపిస్ట్ రిచర్డ్ కేవ్ లుక్‌తో కలిసి ఈ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఒక వ్యక్తి లేదా కమ్యూనిటీకి ఇలాంటి యాప్ ఉంటే బాగుంటుందన్న ఆలోచనతోనే ఈ యాప్‌ను డెవలప్ చేసినట్లు కేవ్ తెలిపారు. యాప్‌ను అభివృద్ధి చేసే సమయంలో ఇలాంటి కమ్యూనికేషన్ టూల్ కోసం చూస్తున్న కొంత మందిని తాము కలిసినట్లు చెప్పారు. ఈ యాప్‌ను వాడాలంటే మీరు మీ ఫోన్‌ను కదలకుండా పట్టుకోవాలి. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే పదాల వైపు చూడాలి. ఎడమ, కుడి, పై వైపు చూడటం ద్వారా అక్కడ ఉన్న పదాలను ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఇందులో సాధారణంగా కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే హలో, థ్యాంక్యూ, గ్రేట్‌, ఓకేలాంటి పదాలు ఉన్నాయి. అంతేకాకుండా అవతలి వ్యక్తి పేరు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఎంపిక చేసుకున్న పదాలను యాప్ గట్టిగా చదివి వినిపిస్తుంది. ఈ లుక్ టు స్పీక్ యాప్ ఆండ్రాయిడ్ 9.0, ఆపై వెర్షన్లు ఉన్న ఫోన్లకు అందుబాటులో ఉంది